రాజకీయ కక్షలతో కొబ్బరితోట ధ్వంసం

ప్రధానాంశాలు

Published : 23/10/2021 04:30 IST

రాజకీయ కక్షలతో కొబ్బరితోట ధ్వంసం

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం వెల్దూరు పంచాయతీలో దారుపు పెంటయ్యరెడ్డికి చెందిన కొబ్బరితోటలో సుమారు వంద చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. శుక్రవారం ఈ విషయం వెలుగుచూడటంతో బాధితులు, గ్రామస్థుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా తిరుగుబాటు సర్పంచి అభ్యర్థినికి మద్దతు ఇచ్చి గెలిపించడమే కాకుండా ఎంపీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి పెంటయ్యరెడ్డి మద్దతు ఇవ్వడంతో గ్రామంలో విభేదాలు చెలరేగినట్లు స్థానికులు చెబుతున్నారు. రాజకీయ కక్షతోనే తన కొబ్బరితోటలో చెట్లను రంపాలతో కోసి ధ్వంసం చేశారంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ జయంతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన