లెహంగాల్లో డ్రగ్స్‌ రవాణా

ప్రధానాంశాలు

Published : 24/10/2021 04:22 IST

లెహంగాల్లో డ్రగ్స్‌ రవాణా

ఆస్ట్రేలియాకు తరలిస్తుండగా హైదరాబాద్‌లో పట్టివేత

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మీదుగా ఆస్ట్రేలియాకు సింథటిక్‌ డ్రగ్స్‌ తరలిస్తున్న ముఠా దందా నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ఆపరేషన్‌తో బహిర్గతమైంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన సూడోఎపిడ్రిన్‌ను కార్గో ద్వారా ఆస్ట్రేలియాకు పంపే ప్రయత్నంలో ఉన్న ముఠాసభ్యుడిని ఎన్‌సీబీ బృందం శనివారం పట్టుకుంది. మహిళలు ధరించే మూడు లెహంగాల అంచుల్లో దాచిన మూడు కిలోల ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. చెన్నైకే చెందిన ముఠా సభ్యుడిని విచారిస్తున్నారు. చెన్నై, బెంగళూరుల నుంచి హైదరాబాద్‌ మీదుగా విమానాల్లో ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాల్ని తరలించే ప్రయత్నంలో ముఠాలు చిక్కడం ఈ ఏడాది ఇది మూడోసారి. ఈ మూడు సందర్భాల్లో 46.4 కిలోల ఎపిడ్రిన్‌, 4.35 కిలోల మెథకొలైన్‌ పట్టుబడటం గమనార్హం.

కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు...
మరో ఘటనలో కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు లెహంగాల్లో తరలిస్తున్న మాదకద్రవ్యాల్ని పట్టుకున్నట్లు ఎన్‌సీబీ అధికారులు శనివారం వెల్లడించారు. బెంగళూరు దేవనహళ్లి ప్రాంతంలో నలుగురిని అరెస్టు చేశారు. వీరిని హైదరాబాద్‌, విశాఖపట్నం, బిహార్‌కు చెందిన రవాణాదారులుగా గుర్తించారు. వారి నుంచి ఎక్‌స్టసీ మాత్రలు, మెథంపెటమైన్‌, మెథకొలైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగా బెంగళూరులో మరో వ్యక్తిని అరెస్టు చేయడంతో అతడి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. బెంగళూరులోని సరఫరాదారుల నుంచి మాదకద్రవ్యాల్ని సేకరించి హైదరాబాద్‌లో యువతకు, పబ్‌లకు విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎన్‌సీబీ బెంగళూరు విభాగం డైరెక్టర్‌ అమిత్‌ తెలిపారు.


నరసాపురం నుంచి చెన్నైకి పార్సిల్‌

బెంగళూరులో నిందితుల వద్ద లభించిన లెహంగాల ప్యాకెట్‌ను పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి నిందితులు చెన్నైకి బుక్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ పార్సిల్‌ను హైదరాబాద్‌ మీదుగా ఆస్ట్రేలియాకు పంపాలనేది నిందితుల యోచనగా తేలింది. ఈ డ్రగ్స్‌ విలువ రూ.కోటి వరకు ఉంటుందని అంచనా.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన