భార్య మరణాన్ని జీర్ణించుకోలేక.. పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

ప్రధానాంశాలు

Published : 24/10/2021 08:10 IST

భార్య మరణాన్ని జీర్ణించుకోలేక.. పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

బెళగావి, న్యూస్‌టుడే: భార్య మరణాన్ని జీర్ణించుకోలేక నలుగురు పిల్లలకు విషమిచ్చి ఆ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా బోరగల్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. మృతులను ఇంటి పెద్ద గోపాల్‌ హాదిమని (48), పిల్లలు సౌమ్య(19), శ్వేత(16), సాక్షి (11), సృజన్‌ (8)గా గుర్తించారు. గోపాల్‌ భార్య జయ (42) జులై 6న బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా కన్నుమూశారు. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన గోపాల్‌ శుక్రవారం పిల్లలతో పాటు తానూ విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. గోపాల్‌ కొంత కాలం కిందటే సైన్యం నుంచి ఉద్యోగ విరమణ చేశారు. సంకేశ్వర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాష్ట్ర సీనియర్‌ మంత్రి గోవింద కారజోళ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో బాధలెన్ని ఎదురైనా ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన