ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:05 IST

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఘటన

నరోటి దామాల్‌

ఈనాడు డిజిటల్‌-జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే-వాజేడు: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలుకు సుమారు 3 కి.మీ. దూరంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ఎలిమిడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లంకపల్లి సమీపంలో ఉన్న బెచ్చిరాకు మడుగు చల్లవాగు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 6.30 గంటల సమయంలో రెండు రాష్ట్రాల గ్రేహౌండ్స్‌, స్పెషల్‌ పార్టీ, సీఆర్‌పీఎఫ్‌, ములుగు, బీజాపూర్‌ పోలీసు బలగాలు సంయుక్తంగా సరిహద్దులోని అటవీ ప్రాంతాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో మృతి చెందిన వారిలో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా జారవేడ గ్రామానికి చెందిన నరోటి దామాల్‌ (ఏసీఎం), ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకు చెందిన పార్టీ సభ్యుడు సోడి రామల్‌, బీజాపూర్‌ జిల్లా గంగులూర్‌ ఏరియా పెద్దకోర్మకు చెందిన పూనెం భద్రు ఉన్నారు. వీరంతా సెంట్రల్‌ రీజినల్‌ కంపెనీ (సీఆర్‌సీ-2)కి చెందినవారు. ఘటన స్థలంలో ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ ఎంఎంజీ, ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్‌, మరో తుపాకీ, ఎస్‌ఎల్‌ఆర్‌ ఎల్‌ఎంజీ 3, మందుగుండు సామగ్రి తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 27న బంద్‌

ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 27న బంద్‌ పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది.


పూనెం భద్రు


సోడి రామల్‌Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన