తీన్మార్‌ మల్లన్నకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:05 IST

తీన్మార్‌ మల్లన్నకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు

నిజామాబాద్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ నిజామాబాద్‌ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్‌కు చెందిన కల్లు వ్యాపారిని డబ్బు డిమాండ్‌ చేసినందుకు ఆయనపై ఈ నెల 10న పోలీసు కేసు నమోదైంది. మల్లన్న అనుచరుడు ఉప్పు సంతోష్‌ ఏ1, మల్లన్నను ఏ2గా చేర్చారు. కేసు నమోదైన రోజే సంతోష్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆ సమయంలో మల్లన్న చంచల్‌గూడ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్నారు. ఆయన కోసం ఇటీవల పోలీసులు పీటీ వారెంటు దాఖలు చేశారు. కోర్టు అనుమతితో చంచల్‌గూడ నుంచి మల్లన్నను నిజామాబాద్‌ న్యాయస్థానంలో సోమవారం హాజరుపరిచారు. తిరిగి ఈ కేసులో 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన