బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

ప్రధానాంశాలు

Updated : 27/10/2021 13:30 IST

బాణసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

ఐదుగురి దుర్మరణం

10 మందికి గాయాలు

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

చెన్నై (కాంచీపురం), న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం పట్టణంలో మంగళవారం రాత్రి బాణసంచా దుకాణంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ దుకాణంలో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించడంతో పక్కనే ఉన్న సెల్‌ఫోన్‌ దుకాణం, బేకరీల్లోకి కూడా మంటలు వ్యాపించాయి. అక్కడ నాలుగు గ్యాస్‌ సిలిండర్లు పేలాయి. దాంతో చుట్టుపక్కల మిగిలిన దుకాణాలకూ మంటలు విస్తరించాయి. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శంకరాపురం, రిషివందియం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. మరికొందరు దుకాణంలో చిక్కుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. జిల్లా కలెక్టరు పీఎన్‌ శ్రీధర్‌, జిల్లా ఎస్పీ జీయావుల్లా, స్థానిక ఎమ్మెల్యే ఉదయసూర్యన్‌, తదితరులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు.


కాలిన గాయాలతో క్షతగాత్రులు
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన