అవినీతి కేసులో వెలుగు సిబ్బంది అరెస్టు

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 05:50 IST

అవినీతి కేసులో వెలుగు సిబ్బంది అరెస్టు

ముదిగుబ్బ, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల పరిధిలో పండ్ల మొక్కలు నాటకుండానే బిల్లులు చేసుకుని అవినీతికి పాల్పడిన కేసులో ఏడుగురు వెలుగు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. ముదిగుబ్బలో బుధవారం కదిరి డీఎస్పీ భవ్యకిశోర్‌ మాట్లాడుతూ... ‘ఉపాధిహామీ పథకం కింద 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి పండ్ల తోటల పెంపకం పనులు జరిగాయి. అందులో డీఆర్‌డీఏ-వెలుగు సిబ్బంది మొక్కలు నాటకుండానే బిల్లులు చేసుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. 2019లో జరిగిన సోషల్‌ ఆడిట్‌లో రూ.3.23 కోట్ల మేర మోసపూరితంగా బిల్లులు చేశారని గుర్తించారు. దుర్వినియోగమైన నిధులను తిరిగి చెల్లించాలని పలుమార్లు నోటీసులు పంపినా స్పందించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టులో 11 మందిని డ్వామా ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఏడుగురు వెలుగు సిబ్బందిపై ముదిగుబ్బ ఠాణాలో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం ఏరియా కో-ఆర్డినేటర్‌ ఓబులేశు, ఏపీఎం రఘునాథరెడ్డి, సీసీలు బాబా ఫకృద్దీన్‌, రమేష్‌, నరసింహులు, వీవోఏలు నారాయణస్వామి, వెంకటనారాయణను అరెస్టు చేశారు. నిందితులను హిందూపురం కోర్టులో హాజరుపరిచారు’ అని వివరించారు. సమావేశంలో నల్లమాడ సీఐ యల్లంరాజు, ఎస్సై విజయ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన