మిలటరీ ఉద్యోగికి హనీట్రాప్‌

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 06:37 IST

మిలటరీ ఉద్యోగికి హనీట్రాప్‌

కటక్‌, న్యూస్‌టుడే: బాలేశ్వర్‌ జిల్లా (ఒడిశా)లోని చాందీపూర్‌లోని అయిదుగురు డీఆర్‌డీఓ ఉద్యోగులకు వలపు వల విసిరి (హనీట్రాప్‌) రహస్యాలు సేకరించిన పాకిస్థాన్‌కు చెందిన యువతి.. రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లోని మిలటరీ ఇంజినీర్‌ సర్వీసెస్‌ నుంచి రహస్యాలు రాబట్టేందుకు ప్రయత్నించిందని ఒడిశా క్రైం బ్రాంచ్‌ బుధవారం వెల్లడించింది. సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగితో పరిచయం పెంచుకొని, ప్రలోభ పెట్టి రహస్యాలు తెలుసుకోవాలనుకుందని వివరించింది. ఈ ఘటనపై రాజస్థాన్‌ క్రైం బ్రాంచ్‌ కేసు నమోదు చేసి, ఒడిశా క్రైం బ్రాంచ్‌ను సంప్రదించిందని వెల్లడించింది. ఇటీవల అయిదుగురు ఉద్యోగులను  క్రైం బ్రాంచ్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరిని విచారించగా ఈ కుట్ర వెనుక పాకిస్థాన్‌కు చెందిన యువతి ఉన్నట్లు బయటపడింది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన