ఉట్నూరు మద్యం డిపోలో అగ్ని ప్రమాదం

ప్రధానాంశాలు

Published : 28/10/2021 04:45 IST

ఉట్నూరు మద్యం డిపోలో అగ్ని ప్రమాదం

సుమారు రూ.వంద కోట్ల సరకు బుగ్గిపాలు

ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు ఐఎంఎల్‌(ఇండియన్‌ మేడ్‌ లిక్కర్‌) డిపోలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు రూ.100 కోట్ల విలువైన సరకు కాలిబూడిదైంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం..ఉదయం 8.30 గంటల సమయంలో డిపో లోపలి భాగం నుంచి పొగలు వస్తున్న విషయాన్ని భద్రతా సిబ్బంది గుర్తించి మేనేజరు ప్రభుదాసుకు సమాచారం అందించారు. ఆయన అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించి, ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే మద్యం సీసాలు పగిలి మంటలు డిపో మొత్తం వ్యాపించాయి. జన్నారం, ఉట్నూరు, ఆదిలాబాద్‌, ఇచ్చోడ నుంచి వచ్చిన నాలుగు అగ్నిమాపక యంత్రాలు దాదాపు ఎనిమిది గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఉట్నూరు ఏఎస్పీ హర్షవర్ధన్‌ తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ‘దాదాపు 40 ఏళ్ల క్రితం నిర్మించిన డిపోలో చాలాకాలంగా విద్యుత్తు సరఫరాకు సంబంధించిన మరమ్మతులు చేపట్టలేదు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాం’ అని డిపో అధికారులు తెలిపారు. ‘ఈ డిపో నుంచి ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌ జిల్లాలకు రోజుకు రూ.రెండు కోట్ల సరకు సరఫరా చేస్తున్నాం. ప్రమాదం జరిగే సమయంలో రూ.100 కోట్లకు పైగా విలువైన మద్యం నిల్వ ఉంది. కొన్ని మద్యం కాటన్లు కాలిపోకుండా బయటకు తీయగలిగాం. వాటి విలువ సుమారు రూ. కోటి వరకు ఉంటుంది’ అని డిపో ఇన్‌ఛార్జి ధీరజ్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన