రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 05:53 IST

రూ.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

చింతూరు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా చింతూరు పరిధిలో రూ.2 కోట్ల విలువైన గంజాయిని మోతుగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... ‘మోతుగూడెం పోలీస్‌స్టేషన్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల నుంచి హైదరాబాద్‌కు కొబ్బరికాయల మాటున తరలిస్తున్న 2,000 కిలోల గంజాయిని పట్టుకున్నాం. గంజాయితో పాటు వ్యాన్‌, కారు, 2 వేల నగదును స్వాధీనం చేసుకున్నాం’ అని వివరించారు. ఖమ్మం జిల్లా లింగాపురం మండలం కొత్తపల్లికి చెందిన న్యాయవాది కడియం గురుసాగర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం, గంట్రావుపల్లెకు చెందిన పొగిడాల పర్వతాలుతో పాటు మరొకరిని అరెస్టు చేశామన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన