దుష్టశక్తులంటూ.. తానే దయ్యమయ్యాడు

ప్రధానాంశాలు

Published : 26/11/2021 06:37 IST

దుష్టశక్తులంటూ.. తానే దయ్యమయ్యాడు

కుటుంబాన్ని చెరబట్టిన నకిలీ బాబా
అక్కాచెల్లెళ్లను బెదిరించి అఘాయిత్యం
అదే బాటలో కుమారుడు.. ఇద్దరికీ కటకటాలు  

అరెస్టయిన నిందితులు అస్కరి (52), అఫ్రోజ్‌(23)

ఈనాడు, హైదరాబాద్‌; కేశవగిరి, న్యూస్‌టుడే: ‘మీ కుటుంబాన్ని దుష్టశక్తులు ఆవహించాయి.. దెయ్యాన్ని వదిలిస్తా’ అంటూ మాయమాటలు చెప్పి, ఇద్దరు అక్కాచెల్లెళ్లను లోబరుచుకుని ఆరేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న దొంగబాబాను గురువారం చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. తండ్రి బాటలో తానూ అకృత్యానికి పాల్పడుతున్న అతడి కొడుకును కూడా అరెస్ట్‌ చేశారు. దక్షిణ మండలం డీసీపీ డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ గురువారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. పాతబస్తీ కిషన్‌బాగ్‌లో ఉండే దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఆరేళ్ల క్రితం తల్లి అనారోగ్యం పాలవగా.. కుమార్తెలిద్దరూ చంచల్‌గూడలో బాబాగా చలామణి అవుతున్న హసన్‌ అస్కరి(52) వద్దకు తీసుకెళ్లారు. కొన్నాళ్లకు ఆమె కోలుకోవడంతో అతడిపై ఆ కుటుంబానికి నమ్మకం కుదిరింది. తరచూ అతని వద్దకు వెళ్లేవారు. అప్పటికే పెళ్లయిన పెద్దకుమార్తె (32)పై కన్నేసిన నకిలీబాబా ఆమెను వశపరుచుకునేందుకు పథకం వేశాడు. ‘నీ భర్త మంత్రాలు చేశాడు. వాటిని వదిలిస్తా’ అంటూ నమ్మబలికాడు. ఒంటరిగా రమ్మని పిలిచి అత్యాచారం చేశాడు. అతని మాయలో పడి బాధితురాలు భర్తకు విడాకులిచ్చింది. ఆమెతో గొడవ కారణంగా తండ్రి, సోదరుడు ఇల్లొదిలి వెళ్లిపోయారు. ఇదే అదనుగా నకిలీ బాబా బాధితురాలి తల్లి, కుమార్తెలను చేరదీసి అద్దె ఇంట్లో ఉంచాడు. వారికున్న ఓ ప్లాటును అమ్మేసి సొమ్ము కాజేశాడు. తర్వాత బాధితురాలి చెల్లి (23)కీ మాయమాటలు చెప్పి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా జడ కత్తిరించి నిర్బంధించాడు.

తనయుడూ బరితెగింపు

బాధితురాళ్లపై తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని గమనించిన తనయుడు అఫ్రోజ్‌ (23) ఆరు నెలల క్రితం వారింటికి వెళ్లి పెద్దకుమార్తెను బెదిరించి అత్యాచారం చేశాడు. తండ్రి లేనప్పుడల్లా వెళ్లి అఘాయిత్యాన్ని కొనసాగించాడు. దీంతో బాధితురాలు రెండురోజుల కిందట చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. నకిలీబాబా హసన్‌ అస్కరి, కొడుకు అఫ్రోజ్‌లను వారు అరెస్టు చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన