close

ప్రధానాంశాలు

Updated : 16/01/2021 11:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. శుక్రవారం తెల్లవారుజామున జ్యూవెల్లరీ దుకాణం వెంటిలేటర్‌ ను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు షాపులో ఉన్న  1219 గ్రాముల బంగారం, 302 గ్రాములు వెండి ఎత్తు కెళ్లారు.

 షాపు తెరిచేందుకు వెళ్లిన ఉద్యోగి లోపల ఉన్న లాకర్లు పగులగొట్టినట్టు ఉండటంతో యజమానికి తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించిన పోలీసులు.. చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో గతంలో పని చేసిన డ్రైవర్‌ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. పోలీసుల విచారణలో డ్రైవర్‌ తన స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డానని చెప్పినట్టు సమాచారం. దొంగిలించిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి...
ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!

క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన