Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009668
            [news_title_telugu_html] => 

బడికెళ్లమన్నందుకే.. బలవన్మరణం

[news_title_telugu] => బడికెళ్లమన్నందుకే.. బలవన్మరణం [news_title_english] => three students make sucide [news_short_description] => బడికెళ్లమని తల్లి మందలించడంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన రాణమ్మ, కృష్ణల పెద్ద కుమారుడు వీరాంజనేయులు(15) ఐదో తరగతి వరకు చదివాడు. ఏడాదిన్నర క్రితం తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. [news_tags_keywords] => Crime,Srikakulam,Students [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 06:52:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బడికెళ్లమన్నందుకే.. బలవన్మరణం - three students make sucide - EENADU
close

తాజావార్తలు

బడికెళ్లమన్నందుకే.. బలవన్మరణం

సి.బెళగల్‌, భాకరాపేట, అరసవల్లి, టెక్కలి పట్టణం, శ్రీకాకుళం, న్యూస్‌టుడే: బడికెళ్లమని తల్లి మందలించడంతో ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం బ్రాహ్మణదొడ్డి గ్రామానికి చెందిన రాణమ్మ, కృష్ణల పెద్ద కుమారుడు వీరాంజనేయులు(15) ఐదో తరగతి వరకు చదివాడు. ఏడాదిన్నర క్రితం తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి పాఠశాలకు వెళ్లడం లేదు. మంగళవారం రాత్రి గ్రామంలో నిర్వహించిన మొహరం కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. దీంతో తల్లి కుమారుడిని మందలించి బడికైనా వెళ్లు.. లేదా పొలానికైనా సక్రమంగా రమ్మని చెప్పింది. ఆగ్రహించిన బాలుడు బుధవారం తెల్లవారుజామున తల్లి ఇంట్లో లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
తల్లిదండ్రులు మందలించడంతో 9వతరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం మఠంపల్లికి చెందిన విజయ్‌కుమార్‌, జమునారాణి దంపతుల కుమారుడు బాలాజీ(14) పది రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు. తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన విద్యార్థి బాలాజీ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నయ్య కలలోకి వస్తున్నాడని..
శ్రీకాకుళం జిల్లా శాస్త్రులపేట గ్రామ పరిధిలోని ఏపీ బీసీ రెసిడెన్షియల్‌లో టెక్కలిలోని రాచవీధికి చెందిన ప్రేమ్‌సాయి పట్నాయక్‌(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. బాత్‌రూంకు వెళ్లి గ్రిల్స్‌కు టైతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తి ఇటీవల చనిపోయాడు. అతను కలలో కనిపిస్తున్నట్లు తోటి విద్యార్థులతో చెప్పేవాడు. ప్రిన్సిపల్‌ గణపతి, హౌస్‌ మాస్టర్‌ రాంప్రసాద్‌, వాచ్‌మెన్‌ వి.సింహాచలంకు కలెక్టర్‌ జె.నివాస్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.