విద్యుత్తు చౌర్యం.. రూ.5.52 లక్షల జరిమానా
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

విద్యుత్తు చౌర్యం.. రూ.5.52 లక్షల జరిమానా

గుంటూరు విద్యుత్తు, న్యూస్‌టుడే: విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్న ఓ వినియోగదారున్ని చాకచక్యంగా పట్టుకుని రూ.5.52 లక్షలు జరిమానా విధించినట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసరు లావణ్య లక్ష్మి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో సంయుక్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు నిజాంపట్నం మండలం హ్యారిస్‌పేట గ్రామంలోని నడికుడితి సుబ్రహ్మణ్యం నిర్వహిస్తున్న రొయ్యల చెరువు వద్ద దాడులు నిర్వహించగా అక్రమంగా విద్యుత్తును వినియోగించుకుంటున్నట్లు తేలిందని తెలిపారు. చాలాకాలంగా విద్యుత్తు చౌర్యానికి పాల్పడుతున్నందున నిందితుడికి రూ.5.52 లక్షలు అపరాధరుసుం విధించినట్లు తెలిపారు. కాంపౌండింగ్‌ రుసుం కింద రూ.56,000 చెల్లించాలని నోటీసు జారీ చేసినట్లు తెలిపారు. విద్యుత్తును అక్రమంగా వాడుకుంటున్న వారిని గుర్తించేందుకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నందున ఎవరూ తప్పించుకోలేరని తెలిపారు. ఈ దాడుల్లో విద్యుత్తు విజిలెన్స్, విద్యుత్తు చౌర్య నిరోధక విభాగం ఇన్‌స్పెక్టర్‌ కరుణాకరరావు, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, సుబ్బనాయుడు, ఏఈ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని