‘విజ్ఞాన్‌ లారా’ విద్యార్థినులకు పెద్ద ప్యాకేజీతో ఉద్యోగాలు
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

‘విజ్ఞాన్‌ లారా’ విద్యార్థినులకు పెద్ద ప్యాకేజీతో ఉద్యోగాలు


వెంకటశృతి, రాజ్యలక్ష్మిలకు బహుమతులు అందజేస్తున్న డాక్టర్‌ రత్తయ్య, డాక్టర్‌ ఫణింద్రకుమార్‌

పొన్నూరు, న్యూస్‌టుడే: వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో సీఎస్‌ఈ విభాగానికి చెందిన ఐ.వెంకటశృతి, ఐటీ విభాగానికి చెందిన డి.రాజ్యలక్ష్మి అమెజాన్‌ సంస్థలో ఉద్యోగాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.ఫణింద్రకుమార్‌ శుక్రవారం వెల్లడించారు. ఒక్కొక్కరికి రూ.18 లక్షల వార్షిక వేతనాన్ని ఆ సంస్థ అందిస్తుందన్నారు. ఈ ఉద్యోగ విజేతలను తనతో పాటు విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించి బహుమతులు అందించినట్టు ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని