భావపురిలో త్వరలో నైపుణ్యాభివృద్ధి కళాశాల
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

భావపురిలో త్వరలో నైపుణ్యాభివృద్ధి కళాశాల


మాట్లాడుతున్న ఉప సభాపతి రఘుపతి

బాపట్ల, న్యూస్‌టుడే : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని ఉప సభాపతి కోన రఘుపతి అన్నారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో నిరుద్యోగ యువతకు జాబ్‌మేళా శుక్రవారం ప్రారంభించారు. ఉప సభాపతి మాట్లాడుతూ బాపట్లలో త్వరలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి కళాశాల ప్రారంభిస్తామని తెలిపారు. యువత ఉద్యోగ నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. ఈ దిశగా ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మేళాలో 40 కంపెనీలు అభ్యర్థులకు రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించి 221 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. సంస్థ జిల్లా మేనేజర్‌ బాజీబాబు, బీఈఎస్‌ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, వైకాపా పట్టణ, మండల అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాష్‌, కోకి రాఘవరెడ్డి, వివేక సర్వీస్‌ సొసైటీ కార్యదర్శి అంబటి మురళీకృష్ణ,, బీఈసీ ప్రిన్సిపల్‌ వలపల దామోదర్‌నాయుడు, భావపురి విద్యాసంస్థల ప్రిన్సిపల్‌ ఆవుల వెంకటేశ్వర్లు తదితరులు ఉద్యోగాలు సాధించిన వారికి అభినందనలు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని