ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసు అపహరణ
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసు అపహరణ

బాపట్ల, న్యూస్‌టుడే : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన బాపట్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రేపల్లె మండలం చినఅరవపల్లికి చెందిన వృద్ధురాలు రఘుపతి అఖిలాండేశ్వరమ్మ బాపట్లలో మనవరాలి అన్న ప్రాసన కార్యక్రమానికి శుక్రవారం వచ్చింది. వేడుకలో పాల్గొని సాయంత్రం ఆర్టీసీ బస్సులో రేపల్లెకు తిరిగి వెళ్తుండగా గుర్తుతెలియని ప్రయాణికుడు ఆమె మెడలో నుంచి ఐదు సవర్ల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై రఫీ తెలిపారు. ఆర్టీసీ బస్సులో పోలీసు సిబ్బందితో కలిసి ఎస్సై తనిఖీలు చేసి, ప్రయాణికులను విచారించామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని