పిన్నెల్లి లక్ష్మారెడ్డి మృతికి నాయకుల సంతాపం
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

పిన్నెల్లి లక్ష్మారెడ్డి మృతికి నాయకుల సంతాపం


నివాళులర్పిస్తున్న మాజీ హోంమంత్రి జానారెడ్డి

మాచర్ల, న్యూస్‌టుడే: మాచర్ల రాజకీయాల్లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి(84) చెరగని ముద్ర వేశారని పలువురు నాయకులు పేర్కొన్నారు. లక్ష్మారెడ్డి మృతి విషయం తెలుసుకున్న వైకాపా, తెదేపా, కాంగ్రెస్‌ పార్టీతో పాటు వివిధ పార్టీల  నాయకులు మాచర్లకు తరలివచ్చి నివాళులర్పించారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి కుందురు జానారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు.  ఆయన మృతి నేపథ్యంలో జానారెడ్డి మాచర్లకు వచ్చి సంతాపం తెలిపారు.  కుటుంబ సభ్యులకు తెదేపా నేతలు ఫోన్‌లో పరామర్శించి      సానుభూతి వ్యక్తం చేశారు. అంతిమయాత్ర ప్రధాన రహదారిపై భారీ జనసందోహం మధ్య జరిగింది.  లక్ష్మారెడ్డి భౌతిక కాయం తరలిస్తున్న ట్రాక్టర్‌ను ప్రభుత్వవిప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నడిపారు. ఆయన మృతి పల్నాడు ప్రాంతానికి తీరని లోటని గురజాల  మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్‌ బ్యాంకు ఉపాధ్యక్షుడుగా, మాచర్ల శాసనసభ్యునిగా పనిచేసి మాచర్ల ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని యరపతినేని పేర్కొన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని