‘బ్రాహ్మణ కార్పొరేషన్‌ స్వతంత్రంగా ఉంచాలి’
eenadu telugu news
Published : 25/09/2021 02:20 IST

‘బ్రాహ్మణ కార్పొరేషన్‌ స్వతంత్రంగా ఉంచాలి’

బాపట్ల, రేపల్లె అర్బన్, న్యూస్‌టుడే : బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో చేర్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు చివుకుల దుర్గాప్రసాద్, బ్రాహ్మణ చైతన్య వేదిక నేత కొండవీటి అగస్త్యేశ్వర శాస్త్రి అన్నారు. శుక్రవారం రాత్రి వేర్వేరుగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. బ్రాహ్మణులు, బీసీలకు గొడవలు పెట్టేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే జీవో నంబరు 103 రద్దు చేయాలని.., లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బ్రాహ్మణులకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.500 కోట్ల నిధులు కేటాయించారన్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణులకు అందించిన 11 పథకాలను ప్రస్తుత వైకాపా ప్రభుత్వం ఆపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల సంక్షేమంపై సీఎం వైఎస్‌ జగన్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని