‘హోంమంత్రి ఆరోపణలు సిగ్గుచేటు’
eenadu telugu news
Published : 22/10/2021 05:24 IST

‘హోంమంత్రి ఆరోపణలు సిగ్గుచేటు’

కాకుమాను, న్యూస్‌టుడే: హోంమంత్రి సుచరిత శాంతిభద్రతలను కాపాడాలని, వైకాపా గూండాలను కాదని సంగం డెయిరీ మాజీ ఛైర్మన్‌, తెదేపా సీనియర్‌ నాయకులు కొల్లా వీరయ్యచౌదరి అన్నారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పర్యవేక్షణలో తెదేపా వారే దాడులు జరుపుకున్నారని ఆమె చెప్పడం సిగ్గుచేటన్నారు. వైకాపా వారిని రక్షించేందుకు తెదేపా వారిని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కార్యాలయాలపై ఎవరు, ఎలా దాడులు చేశారో ప్రజలు టీవీలు, పత్రికలలో చూశారన్నారు. తమ నాయకుడు జగన్‌ ఎంతో హుందాగా ఉంటారని చెప్పిన ఆమె, మరి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అప్పటి సీఎం చంద్రబాబును కాల్చి పారేయాలని చేసిన వ్యాఖ్య గురించి ఏం చెబుతారని ప్రశ్నించారు. జగన్‌ను మెప్పించి తన పదవి కాపాడుకోవడానికి తెదేపాపై ఆరోపణలు చేయడానికి ఆమె వెనుకాడటం లేదన్నారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని వదిలేసి, ఇష్టానుసారం పాలన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును బూతులు తిడుతున్న మంత్రి కొడాలి నానిని వైకాపా వారు ఎందుకు అడగటం లేదని ఆయన ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని