Ts news: పెళ్లైన ఎనిమిది రోజులకే.. 
logo
Updated : 22/06/2021 09:58 IST

Ts news: పెళ్లైన ఎనిమిది రోజులకే.. 

నవ దంపతుల ఆత్మహత్యాయత్నం

వేల్పూర్‌, న్యూస్‌టుడే: వేల్పూర్‌ మండలం పచ్చలనడ్కుడలో నవదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వధువు కొండపల్లి స్వాతి తమ దగ్గరికి వచ్చి భార్యాభర్తలం పురుగుల మందు తాగినట్లు అత్తామామలు గంధం మల్లక్క, గంగాధర్‌కు తెలపడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. హుటాహుటిన వారిని ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని ఎస్సై భరత్‌రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పచ్చలనడ్కుడకు చెందిన గంధం భీమయ్యకు మాక్లూర్‌ మండలం మానిక్‌బండార్‌కు చెందిన కొండపల్లి స్వాతితో ఈ నెల 13న వివాహమైంది. పెళ్లి వేడుకలు ముగించుకొని రెండు కుంటుబాల సభ్యులు ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. గంధం భీమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లగా, స్వాతితో పోలీసులు మాట్లాడగా.. పెళ్లి తనకు ఇష్టం లేదని, బలవంతంగా చేశారని పేర్కొన్నారు. కలిసి జీవించలేం, కలిసి చనిపోదామని తాను పురుగుల మందు తాగి భర్తకు గ్లాసులో ఇచ్చి తాగించినట్లు వాగ్మూలం ఇచ్చిందని ఎస్సై భరత్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. తన కూతురితో వరుడి తరఫువారు కావాలని పురుగుల మందు తాగించారని స్వాతి కుటుంబ సభ్యులు భీమయ్య ఇంటి ఎదుట, ఆర్మూర్‌లో ఆసుపత్రి ఎదుట ఘర్షణకు దిగారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని