విత్తనాల కొరత లేకుండా చూస్తాం
logo
Published : 18/06/2021 04:36 IST

విత్తనాల కొరత లేకుండా చూస్తాం

● వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి జిల్లా అధికారి ఎం.రమేష్‌

పాలనాప్రాంగణం, మావల, న్యూస్‌టుడే


రైతుల సందేహాలను నివృత్తి చేస్తున్న ఇన్‌ఛార్జి డీఏఓ రమేష్‌, మార్క్‌ఫెడ్‌ డీఎం పుల్లయ్య, ఏఓలు శివకుమార్‌, శ్రీనివాసరెడ్డి

జిల్లాలో సోయా విత్తనాల కొరత లేకుండా చూస్తామని వ్యవసాయశాఖ ఇన్‌ఛార్జి జిల్లా అధికారి ఎం.రమేష్‌ అన్నారు. ఏ విత్తనం కొన్నా రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది. రైతులు అడిగిన ప్రతి సందేహాన్ని నివృత్తి చేశారు. జొన్న కొనుగోళ్లకు సంబంధించి మార్క్‌ఫెడ్‌ డీఎం పుల్లయ్య సమాధానాలిచ్చారు. సాగు, ఆయా పథకాల అమలు గురించి సాంకేతిక అధికారులు శివకుమార్‌, శ్రీనివాసరెడ్డి వివరించారు. తమ పరిధిలో లేని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. వాటిని రిజిస్టరులో నమోదు చేసుకుని రైతులకు భరోసానిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని