పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి
logo
Published : 24/06/2021 04:05 IST

పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి

హాజరైన అధికారులు, ఆయాపార్టీల, సంఘాల నాయకులు

మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి డేవిడ్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : పట్టణ సుందరీకరణ, పరిశుభ్రత, ప్రగతి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని అదనపు పాలనాధికారి డేవిడ్‌ కోరారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో షెడ్ల నిర్మాణంపై అభ్యంతరాల దృష్ట్యా ఆయా పార్టీల, సంఘాల నాయకులు, పురపాలక అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. షెడ్ల నిర్మాణ విషయమై పాలనాధికారి దృష్టికి తీసుకెళ్తామని, ఆమె ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. దశలవారీ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. వీధి వ్యాపారులకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా షెడ్ల నిర్మాణ పనుల చేపట్టినట్లు పేర్కొన్నారు. తొలుత ఆయా నాయకులు కళాశాల వద్దకు వెళ్లి షెడ్ల నిర్మాణ స్థలంలో మొక్కలు నాటేందుకు యత్నించారు. ముందస్తుగా అక్కడి చేరుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు వారిని సముదాయించి అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి తీసుకొచ్చారు. షెడ్ల నిర్మాణాలు ఆపకుంటే మాత్రం తమ భవిష్యత్తు కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని నాయకులు పేర్కొన్నారు. డీఆర్డీవో కిషన్‌, డీపీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనరు శైలజ, వార్డు కౌన్సిలర్లు, పార్టీల, విద్యార్థిసంఘాల నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని