విశ్రాంత డీఎఫ్‌వో మహేంద్రనాథ్‌ కన్నుమూత
logo
Published : 22/07/2021 04:50 IST

విశ్రాంత డీఎఫ్‌వో మహేంద్రనాథ్‌ కన్నుమూత

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : విశ్రాంత డీఎఫ్‌వో ఆవుల మహేంద్రనాథ్‌ యాదవ్‌(74) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తన స్వగృహం కైలాస్‌నగర్‌లో కన్నుమూశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జేఏసీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రభుత్వ పింఛదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన మృతిపట్ల ప్రస్తుత సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మారెడ్డి, కిష్టయ్య సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియలు గురువారం ఉదయం 9 గంటలకు జరుగుతాయని వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని