ఇప్పపువ్వు లడ్డూ బలవర్ధక ఆహారం
eenadu telugu news
Updated : 14/10/2021 06:10 IST

ఇప్పపువ్వు లడ్డూ బలవర్ధక ఆహారం


లడ్డూ అందిస్తున్న పాలనాధికారి సిక్తా పట్నాయక్‌, చిత్రంలో ఐటీడీఏ పీఓ, కుమ్ర ఈశ్వరీబాయి తదితరులు

ఉట్నూరు గ్రామీణం, న్యూస్‌టుడే: గిరి గర్భిణులకు ఇప్పపువ్వు లడ్డూల పంపిణీని ప్రయోగాత్మకంగా బుధవారం ప్రారంభించారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం ఉట్నూరు మండలం నీలగోందిలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి సిక్తాపట్నాయక్‌, ఐటీడీఏ పీఓ భవేశ్‌ మిశ్రా, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి లడ్డూలను ఆదివాసీ మహిళలకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ.. ఇప్పపువ్వు లడ్డూ మంచి పౌష్టికాహారమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫైలెట్‌ ప్రాజెక్టు కింద 200 మంది గర్భిణులకు లడ్డూ అందిస్తున్నామన్నారు. త్వరలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు వేల మందికి ఆరు మాసాల పాటు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానికులు నైతం శంకర్‌, సార్‌మేడీ దుర్గు పటేల్‌ అక్కడి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దానికి ఐటీడీఏ పీఓ సానుకూలంగా స్పందించారు. ఉట్నూరు ఎంపీపీ జైవంత్‌రావు, ఎంపీడీఓ తిరుమల, తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, సీడీపీఓ శ్రావణి, సర్పంచి సిద్దేశ్వర్‌, ఉప సర్పంచి ప్రకాష్‌, ఎంపీటీసీ సభ్యుడు మోహన్‌సింగ్‌, ఏపీఓ పీటీజీ మేనేజర్‌ రమణ, నాయకులు అజీమోద్దీన్‌, బాజీరావ్‌, కందుకూరి రమేశ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సంధ్యారాణి పాల్గొన్నారు.

* ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి మాట్లాడుతూ.. కుమురం భీం వర్ధంతి కార్యక్రమ ఆహ్వానపత్రంలో తన పేరు ముద్రించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన పీఓ.. అది తుది ఆహ్వాన పత్రిక కాదని, త్వరలోనే అసలైనది ముద్రిస్తామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయొద్దని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని