ఆమె అధికారం.. ఆయన సహకారం
eenadu telugu news
Updated : 16/10/2021 09:51 IST

ఆమె అధికారం.. ఆయన సహకారం

ప్రజా ప్రతినిధులుగా మహిళలు ఉన్న చాలాచోట్ల అధికారాన్ని భర్తలే చలాయిస్తున్నట్లు విమర్శలుంటాయి. పదవిలో వారి పెత్తనమేంటంటూ పలువురు ప్రశ్నిస్తుంటారు. అభివృద్ధిలో, సమస్యలు తీర్చడంలో ఆమెకు తోడుగా ఆయన ‘కూడా’ ఉంటే ప్రజలకు కాసింత మేలు జరుగుతుంది. ఈ విషయంలో చిత్రంలో కనిపిస్తున్న వీరిని అభినందించొచ్చు. మామడ మండలం జగదాంబతండా పంచాయతీ సర్పంచి ఆడె దేవిబాయి ఊళ్లో వీధి దీపాలను భర్త కిష్టునాయక్‌తో దగ్గరుండి పెట్టిస్తున్నారు. దసరా రావడం బల్బులు పెట్టే వ్యక్తులు అందుబాటులో లేకపోవడంతో పండగ రోజుల్లో గ్రామంలో చీకటి ఉంటే బాగోదని ఇలా ఆ జంట బాధ్యతగా భావించి వెలుగులు పంచే పని కానిచ్చారు.

- న్యూస్‌టుడే, మామడ


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని