మహాగౌరిగా సరస్వతి అమ్మవారు
eenadu telugu news
Published : 15/10/2021 03:17 IST

మహాగౌరిగా సరస్వతి అమ్మవారు

బాసర, న్యూస్‌టుడే: దసరా నవరాత్రి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజు అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి రాజోపచార, చతుషష్టి పూజలు నిర్వహించారు. ఏడు రోజులుగా అమ్మవారికి నిర్వహించని అభిషేకాన్ని గురువారం నాడు నిర్వహించారు. బుధవారం అంకురార్పణ జరిగిన నవచండీహవన పూర్ణాహుతి గురువారం ఉదయం నిర్వహించారు. గురువారం దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, తోగుట పీఠాధిపతి మాధవనంద సరస్వతి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని