TS News: ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోంది?: బండి సంజయ్‌
eenadu telugu news
Published : 28/10/2021 13:30 IST

TS News: ఏ ఉద్దేశంతో ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోంది?: బండి సంజయ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్‌ రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ అయోమయ స్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సీఎం గతంలో చెప్పారన్నారు. వరి సాగుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో బండి సంజయ్‌ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించారా?తెరాస ప్రభుత్వం కర్షకులను ఆదుకుందా?రాష్ట్రంలో ఆకలి చావులు చోటు చేసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించి కేంద్రానికి చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం మాత్రమే చేయాలి. మిగతాది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఏ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరిసాగు చేయొద్దంటోంది’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని