close

సోమవారం, జులై 13, 2020

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తాళాలు పగలగొట్టి.. అందినంతా దోచుకుంటాడు..

ఘరానా దొంగ అరెస్ట్‌

రూ.33,84,988 నగదు స్వాధీనం


వివరాలు వెల్లడిస్తున్న సీపీ శ్రీనివాసులు. చిత్రంలో డీసీపీ హర్షవర్దన్‌రాజు

గవర్నర్‌పేట (విజయవాడ), న్యూస్‌టుడే: ఉయ్యూరులోని ఒక ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.33,84,988 నగదు స్వాధీనం చేసుకున్నారని విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. కమిషనర్‌ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు. ఉయ్యూరు టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా ఎదురుగా ఉన్న సాయిరామ్‌ అలియాస్‌ బుజ్జి టీవీఎస్‌ షోరూం యజమాని రత్నం శివవర ప్రసాదరావు తల్లితో కలిసి షోరూంపై అంతస్తులో నివాసం ఉంటున్నారు. జనవరి 9న ఆయన భక్తులతో కలిసి శబరిమల వెళ్లారు. ఆయన తల్లి 13వ తేదీ ఉదయం ఇంటి గేటుకు తాళం వేసి విజయవాడలోని వారి బంధువుల ఇంటికి వచ్చారు. 14వ తేదీన షోరూం ఓపెన్‌ చేయడానికి మేనేజర్‌ వచ్చి చూడగా.. తాళాలు, పై అంతస్తుకు వెళ్లే తాళాలు పగలకొట్టి ఉన్నాయి. పైన ఇంటి తలుపులు, ఇనుప బీరువా తలుపు విరగొట్టి ఉంది. సుమారు రూ.50 లక్షల నగదు, రూ.10 లక్షల విలువైన బంగారం చోరీకి గురైనట్లు బుజ్జి సోదరుడు రత్నం శ్రీధర్‌ ఉయ్యూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నగర పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌ పోలీసులకు పంపించారు. కమిషనర్‌ ఆదేశాలతో క్రైమ్‌ డీసీపీ డి.కోటేశ్వరరావు, ఏసీపీ శ్రీనివాసరావు స్వీయ పర్యవేక్షణలో సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌వీవీఎస్‌ మూర్తి సిబ్బందితో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. బుజ్జిని విచారించగా చోరీకి గురైన నగదు రూ.77,50,000 అని చెప్పారు. జూన్‌ 8, 9 తేదీల్లో ఉయ్యూరు పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో జరిగిన చోరీ కేసులలో కీలక ఆధారాలతో సీసీ ఫుటేజి, నేరాలు చేసేందుకు నిందితుడు ఉపయోగించిన ద్విచక్ర వాహనం ఆధారంగా జూన్‌ 30న ఉయ్యూరు బైపాస్‌ రోడ్డు వద్ద ముదినేపల్లి మండలం పెదగొన్నూరు గ్రామానికి చెందిన గుబిలి సుబ్రహ్మణ్యంను పట్టుకున్నారు. అతనిపై ముదినేపల్లి పోలీసుస్టేషన్‌లో కేడీ షీటు ఉంది. విజయవాడ, కృష్ణ్లా, పశ్చిమగోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో 12 నేరాలకు పాల్పడి ఆయా కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. దుకాణాలు, ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి సీసీ కెమెరా వైర్లు కట్‌ చేసి చోరీలకు పాల్పడతాడు. అదే క్రమంలో టీవీఎస్‌ షోరూం పై ఇంటిలో నగదు, నగలు అపహరించాడు. అతని వద్ద నుంచి రూ.33,84,988 నగదు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దర్యాప్తు అధికారి ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌వీవీఎస్‌ మూర్తి, ఎస్సైలు వైఎస్‌ రమేష్‌, జి.కృష్ణ, ఏఎస్సై ఎండీ షరీఫ్‌, హెచ్‌సీ ఎల్‌.అనీల్‌, పీసీలు ఎ.సుబ్బారావు, కె.నాగమల్లేశ్వరరావు, బి.మల్లికార్జునరావు, వై.రమేష్‌కుమార్‌ నిందితుల ఆచూకీ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గుర్తించి పట్టుకున్న సిబ్బందిని సీపీ బత్తిన శ్రీనివాసులు అభినందించారు. డీసీపీ హర్షవర్దన్‌రాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.