12.97 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
logo
Published : 03/07/2020 03:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12.97 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం

కలెక్టరు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

మాట్లాడుతున్న జిల్లా కలెక్టరు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో 2020-21 సంవత్సరంలో 12.97 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టరు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌ ప్రాంగణం ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలులో జిల్లా అటవీ సమితి సమావేశం కలెక్టరు అధ్యక్షతన గురువారం జరిగింది. ఆయన మాట్లాడుతూ జగనన్న పచ్చతోరణం, గ్రీన్‌ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటేందుకు ఆయా శాఖలతో అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు అవెన్యూ ప్లాంటేషన్‌ పెంచేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించి డ్వామా పీడీకి వివరాలు అందజేయాలని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న హౌసింగ్‌ కాలనీల్లో రహదారులకు రెండు వైపులా జులై 8 నుంచి 15వ తేదీ లోపు మొక్కలు నాటే కార్యక్రమం చేయాలన్నారు. మొక్కలు నాటే మెగా కార్యక్రమం నిర్వహించడానికి సుమారు 5 వేల మొక్కలు నాటేందుకు విశాలమైన స్థలాన్ని గుర్తించాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో యువ క్లబ్‌లు, గ్రీన్‌ క్లబ్‌లు, రెడ్‌క్రాస్‌ సొసైటీ, స్వచ్ఛంద సేవా సంస్థలను భాగస్వాములను చేసేందుకు వారితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో సంయుక్త కలెక్టరు శ్రీధర్‌రెడ్డి, డివిజినల్‌ అటవీ శాఖ అధికారులు విజయకుమార్‌, శివప్రసాద్‌, డీపీవో యుగంధర్‌కుమార్‌, డ్వామా పీడీ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని