Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అడ్డూ అదుపూ లేని మహమ్మారి

24 గంటల్లో 501 కేసులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా వేగం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. వరుసగా రెండో రోజు కొత్త కేసులు 500 దాటాయి. గత 24 గంటల్లో 501 కొత్త కేసులొచ్చాయి. క్రియాశీలక కేసులు 2,821కి ఎగబాకాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో, మొత్తం కరోనా మరణాల సంఖ్య 686కి చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడినవారి సంఖ్య 82,043కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. కేసులు పెరుగుతున్నా నమూనాల పరీక్షలు మాత్రం పెరగడంలేదు. పరీక్షలు పెరిగితేనే వైరస్‌ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించేందుకు వీలవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ మేరకు: అమరావతి-5, గుంటూరు రూరల్‌-5, మంగళగిరి-32, ముప్పాళ్ల-4, పెదకాకాని-6, పెదకూరపాడు-3, పెదనందిపాడు-1, ఫిరంగిపురం-4, ప్రత్తిపాడు-1, రాజుపాలెం-1, సత్తెనపల్లి-9, తాడేపల్లి-20, తాడికొండ-2, తుళ్లూరు-1, వట్టిచెరుకూరు-2, గుంటూరు-177, దాచేపల్లి-7, గురజాల-2, కారంపూడి-4, మాచవరం-3, మాచర్ల-3, పిడుగురాళ్ల-5, రెంటచింతల-3, చిలకలూరిపేట-7, యడ్లపాడు-1, ఈపూరు-2, నాదెండ్ల-7, నరసరావుపేట-46, నకరికల్లు-5, రొంపిచర్ల-1, వినుకొండ-4, అమృతలూరు-4, భట్టిప్రోలు-3, బాపట్ల-8, చేబ్రోలు-6, చెరుకుపల్లి-1, దుగ్గిరాల-3, కాకుమాను-4, కర్లపాలెం-2, కొల్లిపర-8, కొల్లూరు-3, నగరం-4, నిజాంపట్నం-1, పీవీపాలెం-3, పొన్నూరు-10, రేపల్లె-12, తెనాలి-40, చుండూరు-4, వేమూరు-12.

అందుబాటులో 3,560 రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: కొవిడ్‌ బాధితులకు అవసరమైన దశలో వాడేందుకు రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు 3,560 కేంద్ర ఔషధ భాండాగారంలో అందుబాటులో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ వైద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ జిల్లా కార్యనిర్వాహక ఇంజినీరు శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వీటికి అదనంగా కొవిడ్‌ ఆసుపత్రుల్లో వినియోగించే ఇతర ఔషధాలు, పీపీఈ కిట్లు, ఇతర సామగ్రి సిద్ధంగా ఉంచామని చెప్పారు. జిల్లా సంయుక్త పాలనాధికారి ఎప్పటికప్పుడు వీటి లభ్యతపై సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు.

5,792 మందికి కొవిడ్‌ టీకా

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆదివారం 5,792 మంది కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 2,65,392 మందికి టీకా వేశారు. రెండో డోసు 303 మందికి వేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని