Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉత్కంఠ వీడింది!

గుంటూరు శ్రీను ఆచూకీ లభ్యం

ఈనాడు-అమరావతి: రాష్ట్ర మాజీ మంత్రి, తెదేపా నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ప్రధాన అనుచరుడు గుంటూరు డొంకరోడ్డుకు చెందిన శ్రీను ఎట్టకేలకు న్యాయస్థానంలో లొంగిపోయారు. ఈ పరిణామంతో అటు తెలంగాణ, ఇటు గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులకు ఊపిరిపీల్చుకున్నట్లు అయింది. ఓ స్థిరాస్తికి సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో శ్రీను ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. బోయన్‌పల్లి స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఇదే కేసులో భూమా అఖిలప్రియ జైలుకెళ్లారు. మూడు మాసాల నుంచి తెలంగాణ పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్న శ్రీను స్వస్థలం గుంటూరు కావటంతో పలుమార్లు అతని కోసం తెలంగాణ పోలీసులు నగరానికి వచ్చారు. ఇక్కడ కొంతమంది యువకులను శ్రీను చేరదీసి హైదరాబాద్‌, కర్నూలు,. నంద్యాల ప్రాంతంలో సెటిల్‌మెంట్లు, దందాలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉండటంతో ఆయనకు సంబంధించిన వివరాల సేకరణ కోసం తెలంగాణ పోలీసులు తరచూ అర్బన్‌ పోలీసులతో సంప్రదిస్తున్నారు. అర్బన్‌ పోలీసులు సైతం శ్రీను రాకపోకలపై గుంటూరులో నిఘా ఉంచారు. ఈ క్రమంలో స్వయంగా శ్రీనునే ఇటీవల సికింద్రాబాద్‌ న్యాయస్థానానికి వెళ్లి లొంగిపోవటంతో ఉత్కంఠ వీడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని