Published : 12/04/2021 02:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేటికీ అమలులో త్రిభాషా సూత్రం

భారత ప్రభుత్వంలోని విద్యా శాఖ 1968లో అమలులోకి తీసుకొచ్చిన త్రిభాషా సూత్రం జిల్లాలో గన్నవరం పంచాయతీ కార్యాలయంలో నేటికీ అమలవుతోంది. త్రిభాషా సూత్రం అమలులోకి వచ్చిన దగ్గర నుంచి పంచాయతీ కార్యాలయ బోర్డును తెలుగు, ఆంగ్లం, హిందీ మూడు భాషల్లో ఏర్పాటు చేయడం విశేషం. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకతో పాటు తమిళనాడు ఈ సూత్రాన్ని వ్యతిరేకించి.. రెండేళ్ల తర్వాత నుంచి అనుసరించడం మానేశాయి. కానీ 35 ఏళ్ల సుదీర్ఘ కాలం పంచాయతీ సర్పంచిగా పనిచేసిన జాస్తి వెంకటేశ్వరరావు దీనిని స్థానికంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన బాటలోనే మిగిలిన వారు కొనసాగడం గమనార్హం. - న్యూస్‌టుడే, గన్నవరం గ్రామీణం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని