Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన’

మాట్లాడుతున్న మాజీ మంత్రి వడ్డే, పక్కన గోపాలకృష్ణ, నాయకులు

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆరోపించారు. కేవలం పెట్టుబడిదారుల కోసమే ఆయన ప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 19న విజయవాడలో నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఆదివారం హనుమాన్‌జంక్షన్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో భారత్‌ కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, రైతు నాయకులు ఎలినేని కేశవరావు, ఎర్నేని నాగేంద్రనాథ్‌, గుండపనేని ఉమాప్రసాద్‌, వేములపల్లి శ్రీనివాసరావు, బేతా శ్రీనివాసరావు, తోట సాంబశివరావు, అబ్దుల్‌ బారి, తదితరులు పాల్గొన్నారు.

నూజివీడు రూరల్‌, న్యూస్‌టుడే: ెరౖతులు అప్రమత్తం కాకుంటే ప్రధాని మోదీ ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ విద్యుత్తు మీటర్లు పొలాల్లో ఏర్పాటు చేయిస్తారని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు హెచ్చరించారు. కర్షక, కార్మిక సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నూజివీడులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.1.50 లక్షల కోట్ల ఖర్చుతో ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ ఎలక్ట్ట్రిసిటీ మీటర్ల ఏర్పాటు అవసరమా అని ప్రశ్నించారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలంటూ రైతులు చేపట్టిన ఆందోళనలో 330 మంది రైతులు అమరులు కావడం బాధాకరమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు చలసాని రామారావు, కేడీసీసీబీ మాజీ డైరెక్టర్‌ కొమ్మన నాగేశ్వరరావు, రాష్ట్ర సాగు నీటి సంఘాల అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ, ఏఎంసీ ఛైర్మన్‌ మాజీ కాపా శ్రీనివాసరావు, తదితరులు మాట్లాడారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని