Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గొప్ప సామాజిక తత్వవేత్త ఫులె

తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలో విగ్రహం వద్ద బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి అనంతరాములు, కలెక్టర్‌ ఇంతియాజ్‌

ఆటోనగర్‌(పటమట), న్యూస్‌టుడే: భారతదేశంలో మొదటిసారిగా మహాత్ముడు అని పిలిపించుకున్న గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిరావు ఫులె అని విజయవాడ పార్లమెంటు తెదేపా కమిటీ అధ్యక్షులు నెట్టెం రఘురాం అన్నారు. ఆదివారం ఆటోనగర్‌లోని జిల్లా తెదేపా కార్యాలయంలో ఫులె జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రఘురాం మాట్లాడుతూ అంబేడ్కర్‌, ఫులె ఆదర్శాలకు ఆకర్షితులై, వారు అనుసరించిన బాటలో బడుగు, బలహీన వర్గాల వారికి రాజకీయ అధికారాన్ని కల్పించిన ఘనత తెదేపాకి దక్కుతుందన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ సింహాద్రి కనకాచారి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్‌ లుక్కా సాయిరాం ప్రసాద్‌ గౌడ్‌, కార్పొరేటర్లు జాస్తి సాంబశివరావు, కేశినేని శ్వేత, చెన్నుపాటి ఉషారాణి, నెలిబండ్ల బాలస్వామి, వీరమాచనేని లలిత కిషోర్‌, ముమ్మనేని ప్రసాద్‌, పొట్లూరి సాయిబాబు, గొల్లపూడి నాగేశ్వరరావు, బోయిన సుబ్రహ్మణ్యం, వాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేటి తరానికి ఆదర్శం

విద్యాధరపురం, న్యూస్‌టుడే: జ్యోతిరావు ఫులే చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాములు అన్నారు.తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం సమీపంలోని ఫులే విగ్రహానికి ఆయన కలెక్టర్‌ ఇంతియాజ్‌తో కలిసి పూలమాలలు వేసి ఆదివారం నివాళులర్పించారు. కళాక్షేత్రంలో నిర్వహించిన జయంతి మహోత్సవంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ మహిళలు, రైతులు విద్యావంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించిన వ్యక్తి ఫులే అన్నారు. బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ రామారావు మాట్లాడుతూ ఫులే జీవిత గాథను నేటి తరానికి తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీలు మాధవిలత, మోహన్‌కుమార్‌, సబ్‌కలెక్టర్‌ ధ్యాన్‌చంద్ర, డిప్యూటీ డైరెక్టర్‌ లక్ష్మి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని