Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేడు వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవం

సభాస్థలి ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జేసీ మాధవీలత, చిత్రంలో తలశిల రఘురామ్‌, అధికారులు

పోరంకి, న్యూస్‌టుడే: పోరంకి పరిధి మురళీ రిసార్ట్స్‌లో సోమవారం వాలంటీర్లకు నిర్వహించనున్న సన్మానం, అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను జిల్లా అధికారులు పూర్తి చేశారు. వేదిక ఏర్పాట్లతో పాటు 2400 మంది ఆహ్వానితులకు, మరో 1000 మంది రిస్సార్ట్స్‌ లాంజ్‌లో కూర్చుని కార్యక్రమాన్ని తిలకించేలా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. పోరంకి-నిడమానూరు రోడ్డుకు ఇరువైపులా సీఎంకు స్వాగతం పలుకుతూ.. బ్యానర్లు, కటౌట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం జేసీ మాధవీలత, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌, సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర, జడ్పీ సీీఈవో సూర్యప్రకాష్‌, స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, తహసీీల్దార్‌ జి భద్రు, సీీఐ ముత్యాల సత్యనారాయణ వేదిక, సభాస్థలి ప్రాంగణాన్ని పరిశీలించారు. జేసీ మాట్లాడుతూ ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను గుర్తించామని, వారికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా సన్మానం జరుగుతుందన్నారు. పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, సీీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోరంకి- నిడమానూరు రోడ్డు, బందరు రోడ్డుపై ముఖ్యమంత్రి కాన్వాయ్‌ ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని