Published : 12/04/2021 03:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రసాదాల నాణ్యతలో తేడా వస్తే కఠిన చర్యలు: ఈవో

తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న భ్రమరాంబ

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: ‘ప్రసాదాల నాణ్యతలో తేడా వస్తే కఠిన చర్యలు ఉంటాయి..నాకు తర తమ బేధాలు లేవు..ఎవరి పరిధిలో వారు విధులు సరిగా నిర్వర్తించాలి’ అని దుర్గగుడి ఈవో భ్రమరాంబ ఉద్యోగులు, సిబ్బందిని హెచ్చరించారు. ఆదివారం ఆమె ప్రసాదాల తయారీ కేంద్రాన్ని పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. లడ్డూ సైజు, వాడే సరకులు సరిగా ఉండాలని, అధికారుల పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లోపాలు ఉంటే సహించేది లేదన్నారు. అర్చకులు, వేదపండితులు అమ్మవారి గుడి ప్రతిష్ఠ పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని