Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా వైద్యానికి 20 ఆస్పత్రుల గుర్తింపు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర కొవిడ్‌ ప్రత్యేకాధికారి కె.ఎస్‌.జవహర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం వెబ్‌ కాన్ఫరెన్సు ద్వారా కరోనా పరిస్థితులపై సమీక్షించారు. నగరంలోని విడిది కార్యాలయం నుంచి కలెక్టరు ఇంతియాజ్‌ పాల్గొని జిల్లాలోని పరిస్థితులను వివరించారు. కొవిడ్‌ చికిత్స కోసం 20 ఆసుపత్రులను గుర్తించినట్టు పేర్కొన్నారు. 305 ఐసీయూ పడకలు, 846 అత్యవసర చికిత్స పడకలు, మరో 508 సాధారణ చికిత్సల కోసం పడకలను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో 196 మంది, అత్యవసర కేసుల కింద 680 మంది, సాధారణ చికిత్స కింద 188 మంది ఉన్నట్టు వివరించారు. జిల్లాలో 4,820 మంది హోం ఐసోలేషనులో చికిత్స పొందుతన్నట్టు తెలిపారు. మంగళవారం 1,020 కరోనా వైద్య పరీక్షలు చేయాలని లక్ష్యంగా ఉండగా, 2,665 మంది నుంచి నమూనాలను సేకరించినట్టు పేర్కొన్నారు. జేసీ ఎల్‌.శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని