Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒక్క రోజులో 1,202 కేసులు

జిల్లాలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ నెల 1న 78,101 ఉన్న కేసులు 20వ తేదీ నాటికి 88,710కి పెరిగాయి. సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1,202 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే గుంటూరులోనే అత్యధికంగా కేసులు నమోదు కావడం గమనార్హం. గత ఏడాది జులై 30న 1,124 కేసులు గరిష్ఠంగా నమోదయ్యాయి. ఆ తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. క్రియాశీలక కేసులు 6,120కి ఎగబాకాయి. కరోనా మహమ్మారి కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 695ని చేరింది. ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడినవారి సంఖ్య 88,710కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిలో మొత్తం కేసుల్లో 60.73 శాతం నమోదు కావడం గమనార్హం. ఈ మూడు ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తిపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ మేరకు: అమరావతి-18, అచ్చంపేట-2, బెల్లంకొండ-1, గుంటూరు రూరల్‌-13, క్రోసూరు-2, మంగళగిరి-166, మేడికొండూరు-10, ముప్పాళ్ల-3, పెదకాకాని-21, పెదకూరపాడు-5, పెదనందిపాడు-5, ఫిరంగిపురం-5, ప్రత్తిపాడు-6, రాజుపాలెం-1, సత్తెనపల్లి-12, తాడేపల్లి-121, తాడికొండ-15, తుళ్లూరు-2, వట్టిచెరుకూరు-3, గుంటూరు-443, దాచేపల్లి-4, దుర్గి-4, గురజాల-1, కారంపూడి-10, మాచవరం-3, మాచర్ల-25, పిడుగురాళ్ల-26, రెంటచింతల-6, వెల్దుర్తి-1, బొల్లాపల్లి-4, చిలకలూరిపేట-46, యడ్లపాడు-10, ఈపూరు-2, నాదెండ్ల-2, నరసరావుపేట-63, నకరికల్లు-3, రొంపిచర్ల-6, శావల్యాపురం-2, వినుకొండ-13, నూజెండ్ల-2, అమృతలూరు-1, భట్టిప్రోలు-1, బాపట్ల-16, చేబ్రోలు-12, చెరుకుపల్లి-1, దుగ్గిరాల-9, కాకుమాను-2, కొల్లిపర-2, కొల్లూరు-3, నగరం-2, నిజాంపట్నం-2, పొన్నూరు-6, రేపల్లె-4, తెనాలి-39, చుండూరు-6, వేమూరు-9.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని