Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నరసరావుపేటలో పాక్షిక లాక్‌డౌన్‌

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: అధికారులు, ప్రజల సమష్టి కృషితోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో మంగళవారం కరోనా వ్యాప్తి నేపథ్యంలో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో వ్యాపారసంస్థలు, వివిధ సంస్థలు గురువారం నుంచి 15 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ తెరచి ఉంచేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ కొవిడ్‌ పరీక్షలు చేసి పాజిటివ్‌ కేసుల నిర్ధారణతో పాటు అవసరమైన మందులు, పీపీఈ కిట్లు, ఆక్సిజన్‌ తదితర అంశాలపై ముందస్తుగా నిల్వలు ఉండేలా చూసుకోవాలని కోరారు. మాస్క్‌లు ధరించకుండా సంచరిస్తే జరిమానా విధించాలన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని