Published : 21/04/2021 05:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అత్యవసర సహాయానికి కంట్రోల్‌రూం

86888 31573కి ఫోన్‌ చేస్తే సత్వర సాయం

అర్బన్‌లో 37 మంది పోలీసులకు పాజిటివ్‌

అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

సమీక్షలో అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి, ఏఎస్పీలు గంగాధరం, మనోహరరావు, డీఎస్పీలు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు సిబ్బంది కరోనా బారిన పడకుండా అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ తన కార్యాలయం నుంచి సిబ్బంది ఆరోగ్యంపై సమీక్షించారు. అర్బన్‌ పరిధిలో ఇప్పటి వరకు 37 మంది కరోనా బారిన పడ్డారని తెలిపారు. వాళ్లు హోం ఐసోలేషన్‌లో, ఆసుపత్రుల్లో అధికారుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారి క్షేమ సమాచారం నిత్యం అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ఈక్రమంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అత్యవసర సహాయం కోసం కొవిడ్‌ కంట్రోల్‌ రూం 86888 31573ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ నంబర్‌కి ఫోన్‌ చేస్తే సత్వర సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు డీజీపీ తన కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన అర్బన్‌ ఎస్పీ కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా సోకిన పోలీసు సిబ్బంది ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. కరోనా టీకా మొదటి డోసు 98 శాతం సిబ్బంది తీసుకున్నారని, రెండో డోసు వేగవంతంగా అందిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీలు గంగాధరం, మనోహరరావు, పోలీసు ఆసుపత్రి వైద్యురాలు మంజుల రాజశేఖర్‌, డీఎస్పీలు ప్రకాష్‌బాబు, బాలసుందరరావు, శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌, సీఐలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని