Published : 21/04/2021 05:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జిల్లా రైతులకు రూ.11.18 కోట్ల వడ్డీ రాయితీ

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్సు (వీసీ) నిర్వహించి, వై.ఎస్‌.ఆర్‌.సున్నా వడ్డీ పథకం కింద రాయితీ నిధులను జమ చేశారు. నగరంలోని విడిది కార్యాలయ నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, కలెక్టరు ఇంతియాజ్‌, అధికారులు, రైతులు జిల్లా స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. 51,089 మంది రైతులకు రూ.11.18 కోట్ల రాయితీ నిధులు జమ అయినట్టు కలెక్టరు తెలిపారు. రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్నవారు సకాలంలో బ్యాంకులకు చెల్లింపులు చేస్తే.. 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్నదాతలను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేయూత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. మధ్య నగర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జేసీ కె.మాధవీలత, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల జేడీలు టి.మోహనరావు, విద్యాసాగర్‌, లీడ్‌ బ్యాంకు మేనేజరు రామ్మోహనరావు, ఉద్యాన శాఖ ఏడీ దయాకరబాబు తదితరులు పాల్గొన్నారు. వీసీలో పలువురు రైతులు సీఎంతో మాట్లాడి, ఇలాంటి పథకాలను అమలు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని