Published : 21/04/2021 05:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పొందుగల వద్ద ట్రాలీ ఆటో బోల్తా

ఇద్దరు వ్యవసాయ కూలీల మృతి

మరో 20 మందికి తీవ్రగాయాలు

 

ప్రమాద దృశ్యం.. ఘటనా స్థలంలో రోదిస్తున్న బాధితులు

పొందుగల (దాచేపల్లి), న్యూస్‌టుడే : ఏపీ- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన దాచేపల్లి మండలం కృష్ణానది తీరానున్న పొందుగల వద్ద ఓ ట్రాలీ ఆటో అదుపు తప్పి బోల్తా పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలైన దుర్ఘటన మంగళవారం జరిగింది. దాచేపల్లి పోలీసుల వివరాల మేరకు.. మిర్యాలగూడ సమీపంలోని అన్నారం తండా నుంచి 35 మందికి పైగా వ్యవసాయ కూలీలు ట్రాలీ ఆటో ఎక్కి గురజాల మండలం పులిపాడులోని మిర్చి పొలాలకు వచ్చారు. కోతలు పూర్తవడంతో తిరిగి వయా కృష్ణానది మీదుగా ఇంటికి వెళ్తున్నారు. అయితే మార్గమధ్యలో అదుపు తప్పిన ట్రాలీ ఆటో పొందుగల వద్ద ప్రధాన రహదారిలో బోల్తా పడింది. దాంతో దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని దాచేపల్లి 108 సహా పలు వాహనాల్లో మిర్యాలగూడ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందులో సాయి, లింగానాయక్‌ అనే వ్యక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంకా రూపావత్‌ మంగ్యానాయక్‌, భూక్యా ప్రియాంజలి, మాలోతు జయ, రూపావతు దత్తు, భూక్యా మంగ్లీ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాలనాగిరెడ్డి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని