Published : 21/04/2021 05:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

57,684 మంది రైతులకు రూ.11.9 కోట్లు


వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న హోంమంత్రి సుచరిత, చిత్రంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, జేడీఏ విజయభారతి

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా 57,684 మంది రైతులకు రూ.11.909 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. తాడేపల్లి నుంచి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సున్నా వడ్డీ పంట రుణం పథకం 2020 రబీకి సంబంధించి వడ్డీ రాయితీ చెల్లింపులను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌ నుంచి హోంమంత్రి సుచరిత, కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ హాజరయ్యారు. హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ అన్నదాతలకు రైతు భరోసా ద్వారా పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు సరఫరా చేస్తున్నారన్నారు. పంటలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలన్నీ క్యాలెండర్‌ ప్రకారం ప్రకటించిన తేదీకి అమలు చేస్తున్నారన్నారు. మేలో రైతు భరోసా నిధులు విడుదల చేయడంతో పాటు, పంటల బీమా నగదును ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరారు. వీసీలో జేడీఏ ఎం.విజయభారతి, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి: హోంమంత్రి

ఈనాడు డిజిటల్‌, గుంటూరు: కొవిడ్‌ కేసుల తాకిడి నేపథ్యంలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైతేనే బయటకు రావాలని హోంమంత్రి మేకతోటి సుచరిత హెచ్చరించారు. కొవిడ్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన వారంతా తక్షణమే వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. గుంటూరు కలెక్టరేట్లో కొవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలపై కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌తో కలిసి హోంమంత్రి సమీక్షించారు. కేసులు పెరగడానికి ప్రజల్లో నిర్లక్ష్యమూ కారణమేనన్న హోంమంత్రి సుచరిత.. వివాహాలు, శుభకార్యాలు జరిగేటప్పుడు మరింత జాగ్రత్తతతో వ్యవహరించాలని కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని