Published : 21/04/2021 05:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

3 నుంచి రోగుల సహాయకులకు భోజనం


ఆసుపత్రిలో ఏర్పాటు చేసే భోజనశాలను పరిశీలిస్తున్న మంతి శ్రీరంగనాథరాజు, ప్రభావతి తదితరులు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రిలో రోగుల సహాయకులకు రెండు పూటలా రుచి, శుచికరమైన భోజనం అందించే కార్యక్రమాన్ని మే 3వ తేదీ నుంచి నుంచి ప్రారంభించనున్నట్లు మంత్రి శ్రీరంగనాథరాజు తెలిపారు. ఇందుకోసం ఆసుపత్రిలో జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించిన అనంతరం మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ కోయంబత్తూరు నుంచి పరికరాలు తెప్పించి అత్యాధునిక కిచెన్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఒకేసారి 300 మంది భోజనం చేసేలా సదుపాయాలు కల్పించామన్నారు. మిగిలిన పనులు నెలాఖరుకు పూర్తవుతాయన్నారు. అనంతరం సూపరింటెండెంట్‌ ప్రభావతి మాట్లాడుతూ రోగుల సహాయకులకు తన సొంత ఖర్చులతో ఉచితంగా భోజనం అందించేందుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ పథకానికి ఇప్పటికే మంత్రి రూ.కోటి విరాళంగా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో సీఎస్‌ఆర్‌ఎంవో సతీశ్‌కుమార్‌, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని