అడిగినంత ఇస్తేనే.. అంబులెన్స్‌ కదిలేది
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అడిగినంత ఇస్తేనే.. అంబులెన్స్‌ కదిలేది

రోనా బారినపడి.. అష్టకష్టాలతో విజయవాడ రాష్ట్ర కొవిడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు కొంచెం కుదుటపడి.. స్వస్థలాలకు వెళ్లాలనుకున్నా.. లేక మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి వెళ్లాలనుకున్నా.. అంబులెన్స్‌లు దొరకడం లేదు. ఆసుపత్రి బయట పదుల సంఖ్యలో వాహనాలు ఉన్నా.. అందరూ సిండికేట్‌ అవుతున్నారు. ఎవరైనా వస్తే.. ఆసుపత్రి వెనుక మా నాయకుడున్నాడు.. మాట్లాడుకుని రండి అని చెబుతున్నారు. అక్కడికెళ్లి అడిగితే ఎక్కువ ఇస్తామంటే గాని అంబులెన్స్‌ పంపడంలేదు.   ఈ నేపథ్యంలో కలెక్టర్‌ అంబులెన్సులకు ధరలు నిర్ణయిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అవసరముంది.

- ఈనాడు, అమరావతి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని