తపాలా కార్యాలయ పనివేళల్లో మార్పు
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తపాలా కార్యాలయ పనివేళల్లో మార్పు

విద్యాధరపురం, కృష్ణలంక, న్యూస్‌టుడే: కొవిడ్‌ విస్తరిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ పోస్టల్‌ సర్కిల్‌ పరిధిలోని తపాల కార్యాలయ పనివేళలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు మార్పు చేసినట్లు చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్నందున వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రిజిస్టర్‌ పోస్టులు, స్పీడ్‌ పోస్టులు, నగదు లావాదేవీలు, సేవింగ్స్‌కు వచ్చే వినియోగదారులు కొవిడ్‌ నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన వారికి మాత్రమే సేవలు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని