అంబులెన్సు సేవల ధరలకు కళ్లెం
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబులెన్సు సేవల ధరలకు కళ్లెం

నిర్ణీత రుసుము నిర్ణయించిన కలెక్టర్చు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కొవిడ్‌ బారిన చనిపోయినా లేదా ఇతర అనారోగ్య కారణాల వల్ల వ్యక్తులు మరణించిన తరుణంలో నాన్‌-కొవిడ్‌, కొవిడ్‌ మృతదేహాలను తరలించడానికి అంబులెన్సుల నిర్వాహకులు అధిక ధరలను వసూలు చేస్తున్న క్రమంలో వీటికి ఒక నిర్ణీత ధరను నిర్ణయిస్తూ కలెక్టరు ఇంతియాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మారుతీ ఓమిని, ఎల్‌ఎంవీఎస్‌, టెంపో/తుపాను తదితర వాహనాల అంబులెన్సులకు.. ఆయా వాహనాల రకాన్ని బట్టి రుసుము నిర్ణయించారు. ఆసుపత్రి/మార్చురీల నుంచి వారి ప్రాంతాలకు చెందిన గృహాలు/శ్మశాన వాటికకు చేరవేతకు కిలో మీటర్ల మేర దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించారు. 1 కి.మీ. నుంచి 110 కి.మీ.ల వరకు ధరల వివరాలను తెలియజేశారు. 150 కి.మీ. దూరం దాటితే కి.మీ.కు అదనం రూ.20లు తీసుకోవచ్చు. వేచి ఉండే సమయం, డ్రైవర్‌ బేటాలనూ నిర్ణయించారు.

అధిక ధరలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి..
అంబులెన్సుల్లో మృతదేహాల తరలింపు విషయంలో ఎవరైనా ఎక్కువ ధరలు వసూలు చేస్తే.. కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబరు 94910 58200కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టరు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని