కొవిడ్‌ కేర్‌ సెంటరు ప్రారంభం
logo
Published : 07/05/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ కేర్‌ సెంటరు ప్రారంభం

సీవీ రెడ్డి ఛారిటీస్‌ స్థలంలో కేంద్రంలో ఏర్పాటు చేసిన పడకలు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: పాతబస్తీలో దుర్గగుడి దత్త సంస్థ సీవీరెడ్డి ఛారిటీస్‌ స్థలంలో సంభవ్‌నాథ్‌ రాజేంద్ర సూరి జైన్‌ స్వేతంబర్‌ ట్రస్టు ఏర్పాటు చేసిన కొవిడ్‌ కేర్‌ సెంటరును గురువారం ప్రారంభించారు. ట్రస్టు ఏర్పాటు చేసిన పడకల్లో 30 శాతం దుర్గగుడి సిబ్బందికి, 70 శాతం కలెక్టర్‌ ఆదేశాల మేరకు ట్రస్టు సూచించిన వ్యక్తులకు కేటాయిస్తారు. చారిటీస్‌లోని నాలుగు హాళ్లలో బెడ్స్‌, ఏసీలను ట్రస్టు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. తొలిరోజున ముగ్గురిని కొవిడ్‌ నిబంధనల ప్రకారం చేర్చుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దుర్గగుడి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు మాత్రం ఉచితంగా వైద్య, వసతి సౌకర్యం కల్పించేందుకు ట్రస్టు అంగీకరించింది. ట్రస్టు సూచించిన వ్యక్తుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.21వేలు చెల్లించాల్సి ఉంటుంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ సెంటరులో వైద్యులు, సహాయకులు, నర్సులు, వసతి సౌకర్యాల నిర్వహణ బాధ్యత పూర్తిగా ట్రస్టు వహించాల్సి ఉంటుందని దేవస్థానం అధికారులు తెలిపారు.

వెన్యూలో ఆక్సిజన్‌ పైపుల ఏర్పాటును పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ ధ్యానచంద్ర

రెండు రోజుల్లో వెన్యూలో ...
కొత్త ఆస్పత్రి కూడలి, న్యూస్‌టుడే: కొవిడ్‌ రోగులకు వైద్య సేవలు అందించేందుకు కొత్తాసుపత్రి పక్కనే ఉన్న వెన్యూ కన్వెన్షన్‌లో కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇక్కడ ఆక్సిజన్‌తో కూడిన పడకల ఏర్పాట్లను రెండు రోజుల్లో పూర్తి కానున్నాయని సబ్‌ కలెక్టర్‌ హెచ్‌.ఎం.ధ్యానచంద్ర తెలిపారు. గురువారం ఆయన వెన్యూ కన్వెన్షన్‌ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆక్సిజన్‌తో కూడిన పడకలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయన్నారు. కొవిడ్‌ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని