సరఫరాకు పటిష్ఠ చర్యలు
logo
Published : 07/05/2021 03:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరఫరాకు పటిష్ఠ చర్యలు

మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌      

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: కొవిడ్‌-19 ఆసుపత్రులకు అవసరమైన ఆక్సిజన్‌ సక్రమంగా సరఫరా అయ్యేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో గురువారం ఆక్సిజన్‌ డిస్ట్రిబ్యూషన్‌ నోడల్‌ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆక్సిజన్‌ కోసం ఆసుపత్రులు ప్రతి రోజు ఎంఎస్‌ఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న ఇండెంట్లను సంబంధిత నోడల్‌ అధికారులు తప్పకుండా పరిశీలించాలన్నారు. చిన్న ఆసుపత్రులకు సైతం ఆక్సిజన్‌ ఇబ్బంది లేకుండా సరఫరా చేయాలన్నారు. ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ ప్లాంట్ల వద్ద సిలిండర్లు నింపేందుకు ఆసుపత్రుల యాజమాన్యాలు ఎక్కువ సేపు వేచి ఉండకుండా ఫిల్లింగ్‌ పాయింట్ల సమీపంలో ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇండస్ట్రియల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లను మెడికల్‌ ఆక్సిజన్‌ సిలిండర్లగా మార్పు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. బ్లాక్‌ మార్కెట్‌లో వీటి విక్రయాలను అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని డ్రగ్‌ కంట్రోలర్‌ అధికారులకు సూచించారు. ఎవరైనా అక్రమంగా సిలిండర్లను నిల్వ చేస్తే పౌర సరఫరాల చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి కాంట్రాక్ట్‌ ప్రకారం లిక్విడ్‌ ఆక్సిజన్‌ సక్రమంగా సరఫరా చేయని ఏజెన్సీకి వెంటనే నోటీసులు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం సరఫరా అవుతున్న కోటాను రానున్న రోజుల్లో అవసరం మేరకు పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ ఏఎస్‌ దినేష్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఏడు రీఫిలింగ్‌ ప్లాంట్లకు, ఒక మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే పరిశ్రమ నుంచి సరఫరా అవుతున్న ఆక్సిజన్‌ను కొవిడ్‌-19 ఆసుపత్రులకు ఇబ్బంది లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో జేసీ-2 కె.శ్రీధర్‌రెడ్డి, శిక్షణ కలెక్టర్‌ శుభం బన్సాల్‌, డీఆర్‌వో పి.కొండయ్య, పరిశ్రమల శాఖ జీఎం ఏ.వి.పటేల్‌, తదితరులు పాల్గొన్నారు.
వృథాను తగ్గించాలి
కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: ఆసుపత్రుల యాజమాన్యాలు ఆక్సిజన్‌ నిర్వహణలో వృథాను తగ్గించడంతో పాటు వారికి సరఫరా అవుతున్న మెడికల్‌ ఆక్సిజన్‌ మేరకు రోగులను చేర్చుకోవాలని కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ పేర్కొన్నారు. మెడికల్‌ ఆక్సిజన్‌ అందుబాటు మేరకు మాత్రమే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం రోగులను చేర్చుకునేలా నోడల్‌ అధికారి పర్యవేక్షించాలన్నారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని